యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులో భారీ అంచనాల నెలకొన్నాయి. కొరటాల శివ డైరెక్షన్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా గ్లింప్స్ ను త్వరలోనే రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఊర మాస్ డైలాగ్ లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్.. విలన్‌తో ఈ పవర్ ఫుల్ డైలాగ్ చెప్తాడట. అయితే అది ఏ నేపధ్యంలో అనేది కచ్చితంగా తెలియదు.
ఇంతకీ ఆ డైలాగు ఏంటంటే.. యమ పాసంతో ఉయ్యాల ఊగాలని సూస్తే.. అది మెడకు చుట్టుకొని సావుని పరిచయం చేస్తది.. ఈ డైలాగ్ ఎన్టీఆర్ తన పవర్ఫుల్ మాడ్యూల్లో చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు కొరటాల. దీంతో చాలాకాలం తర్వాత ఎన్టీఆర్ దేవరాకు సంబంధించి ఈ డైలాగ్ లీక్ అవ్వడం ఫాన్స్ కు మంచి కిక్ ఇస్తుంది. కాగా ఈ డైలాగ్ మూవీ యూనిట్ ద్వారా బయటకు లీక్ అయిందా.. లేదంటే ఎవరైనా సినిమా డైలాగులు లీక్ చేశారా.. అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయ అంశం అయింది.
ఏది ఏమైనప్పటికీ ఎన్టీఆర్ నుంచి ఇలాంటి ఊర మాస్ డైలాగ్ విని చాలా రోజులు అవడంతో ఎన్టీఆర్ ఈ సినిమాతో మళ్ళీ కచ్చితంగా హిట్ కొడతాడు అంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ రేంజ్ కు తగ్గట్టు కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయట. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ రేంజ్ లో దేవర సినిమాను ఏ రేంజ్ లో కొరటాల ఎలివేట్ చేశాడు చూడాలి. అయితే కొలతల శివకు ఈ సినిమా సక్సెస్ అవ్వడం చాలా ముఖ్యం. దీంతో చాలా కసిగా స్టోరీని డైరెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.