బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది పాపులారిటీని సంపాదించుకున్నారు. అందులో కౌశల్ ఒకరు. ఈయన బిగ్ బాస్ షో కి వెళ్లక ముందు పలు సినిమాలలో సీరియల్స్ లో నటించి ప్రేక్షకులని అలరించేవాడు. అయితే బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నటువంటి ఈయన సీజన్ 2 విన్నర్ గా నిలిచి బయటకు వచ్చాడు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో ఈయన కొనసాగిన తీరును చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈయనకి భారీ ఫాలోయింగ్ సైతం ఏర్పడింది.
ఇక ఈ కార్యక్రమంలో ఈయన విజేతగా నిలవడంతో ఇక ఈయన లైఫ్ సెటిల్ అయిపోతుందని అందరూ భావించారు. కానీ కౌశల్ కి మాత్రం ఫాలోయింగ్ ఒక్కటే దక్కింది. ఇక తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కౌశల్ పలు ఆసక్తికర విషయాలను తెలిపాడు. ఈయన మాట్లాడుతూ..” నేను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు చాలామంది నాకు సపోర్ట్ చేశారు. అందుకే కార్యక్రమం పూర్తి కాగానే అభిమానులందరికీ కలవడానికి వెళ్లాను.
అలా అభిమానులతోనే 8 నెలల పాటు సమయం గడిపాను. అనంతరం కొన్ని సినిమా కథలను విన్నాను.. అంతలోపే కరోనా రావడంతో నా కెరీర్ కు బ్రేక్ పడింది. ఇక నేను అనంతరం ఓ రెండు సినిమాలలో చేశాను. కానీ అవి పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాయి. ఇక త్వరలోనే ఓ పాన్ ఇండియా సినిమాతో మీ ముందుకి రాబోతున్న. ఈ సినిమా దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమాని మీరంతా చూసి ఆశీర్వదించాలని కోరుతున్న ” అంటూ చెప్పుకొచ్చాడు కౌశల్. ప్రస్తుతం కౌశల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.