ఎన్టీఆర్ లో యాక్టింగ్‌తో పాటు ఆ స్పెష‌ల్ టాలెంట్ కూడా ఉందా.. అదేంటో తెలుసా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు పాన్ ఇండియాలో ఉన్న క్రేజ్‌ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ బిరుదును అందుకున్నాడు. ఈ సినిమాలో నాటునాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ – కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా రెండు పార్ట్‌లుగా రిలీజ్ కాబోతోంది. ఇందులో దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్గా, బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.

ఇక నటనలో తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్‌కు మరో స్పెషల్ టాలెంట్ కూడా ఉందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంత‌కి ఆ స్పెషల్ టాలెంట్ ఏంటా అనుకుంటున్నారా. ఎన్టీఆర్ ఆదివారం వచ్చిందంటే ఇంట్లో రకరకాల ఆహార పదార్థాలు తానే తయారు చేసి అందరికీ పెడుతూ ఉంటాడట. ఇలా ఏదైనా స్పెషల్ డిష్‌ చేసినప్పుడు తప్పకుండా నన్ను కూడా పిలుస్తాడు అంటూ కళ్యాణ్ రామ్‌ వివరించాడు. ఎప్పుడైనా ఫ్రస్టేషన్ లో ఉన్నా కూడా వెంటనే ఎన్టీఆర్ కిచెన్ లోకి వెళ్లిపోయి వంటలు చేసేస్తాడట.

ఒకవేళ షూటింగ్స్ లేకపోతే ఎన్టీఆర్ ఇలా సైడ్ బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు అంటూ గతంలో కళ్యాణ్‌రామ్ ఓ ఇంట‌ర్వ్యులో సరదాగా మాట్లాడాడు. దీనిపై ఎన్టీఆర్ స్పందిస్తూ ప్రస్తుతం సైడ్ బిజినెస్ లు ఏవి పెట్టుకోవాలని ఆలోచన లేదు.. కాకపోతే వంట చేయడం నాకు చాలా ఇష్టం అంటూ వివరించాడు. కొన్నిసార్లు లక్ష్మి ప్రణతి కూడా నేను చేసిన వంట తిని ఒక వంద క్యారేజీలు నాకు చేసి ఇవ్వు.. ఆమ్మి పెడతా అంటూ సరదాగా మాట్లాడుతుందని.. జూనియర్ ఎన్టీఆర్ వివరించాడు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న ఈ టాలెంట్ తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.