బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించి మంచి పాపులారిటీని దక్కించుకున్నాడు ఈయన. అంతేకాకుండా ” కౌన్ బనేగా కరోడ్పతి ” అని రియాల్టీ షోలో హోస్ట్ గా వ్యవహరిస్తూ పలు సీజన్లో పూర్తి చేశారు అమితాబ్. ఇక ప్రస్తుతం ఈ షో 14 సీజన్లు పూర్తి చేసుకుని 15వ సీజన్ ప్రసారమైంది.
అయితే డిసెంబర్ 29న ఈ సీజన్ చివరి ఎపిసోడ్ ప్రసారం అవ్వగా అందులో అమితాబ్ ఎమోషనల్ అయ్యారు. ఈయన మాట్లాడుతూ..” లేడీస్ అండ్ జెంటిల్మెన్స్.. మేము వీడ్కోలు పలుకుతున్నాము. ఈ వేదిక రేపటి నుంచి కనిపించదు. అలాగే నేను కూడా ఇక్కడ కనిపించను అని చెప్పాలనిపించడం లేదు.
నేను అమితాబ్ బచ్చన్ ఈ సీజన్లో చివరిసారిగా నేను చెప్పేది ఒకటే.. గుడ్ నైట్ .. గుడ్ నైట్ ” అంటూ ఎమోషనల్ అయ్యారు అమితాబ్. ఇక దీంతో అక్కడ ఉన్న ఈయన ఫ్యాన్స్ కూడా కంటతడి పెట్టుకున్నారు. అలాగే దేవుడిని చూడలేదు. కానీ ఆ దేవుడికి అత్యంత ఇష్టమైన వ్యక్తిని చూసాము అంటూ ఓ మహిళ ఫుల్ ఎమోషనల్ అయింది. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
View this post on Instagram