ఈ మధ్యకాలంలో చాలామంది స్టార్ హీరోలు పాన్, పొగాకు, మద్యం ప్రకటనలు ఇస్తూ భారీగా సంపాదిస్తున్నారు. కానీ మెగా హీరోలు మాత్రం దానికి పూర్తి విరుద్ధం. ఇక ఈ విషయంలోనే మరోసారి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు అల్లు అర్జున్. పలు బ్రాండ్లకు యాడ్ ఇస్తున్న బన్నీ దుమ పానానికి సంబంధించిన యాడ్ కు నో చెప్పాడట.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఒక పొగాకు కంపెనీ తమ యాడ్ షూట్ కోసం ఒక రోజులో జస్ట్ రెండు గంటలు కెమెరా ముందుకు అలా వచ్చి ఇలా వెళితే చాలని.. దాదాపు రూ. 10 కోట్ల వరకు చెల్లిస్తామని బన్నీకి ఆఫర్ ఇచ్చారట. కానీ బన్నీ మాత్రం సింపుల్ గా చేయనని నో చెప్పేసాడట. అంతేకాకుండా…” అలాంటి యాడ్స్ అసలు చేయను.. నా అభిమానులు అవి చూసి వాటికి అలవాటు పడతారు ” అని చెప్పినట్లు సమాచారం.
ఇక అక్కడితో ఆగకుండా ఆ బ్రాండ్ కు చెందిన వారు.. ” పుష్ప 2 ” చిత్ర బృందాన్ని కలిసి ఈ మూవీలో హీరో ఎప్పుడూ మద్యం తాగినా, స్మోక్ చేసిన, పొగాకు నమిలినా… వారి బ్రాండ్ ని వాడేలా ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని అనుకున్నారట. అలాగే రెండు సీన్లలో వారి బ్రాండ్ పేరు కనిపించేలా చూడాలని కోరారట. కానీ బన్నీ దీనికి అస్సలు ఒప్పుకోలేదట.