బాలీవుడ్ స్టార్ కపుల్ ఆలియా భట్, రణబీర్ కపూర్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ 2022 నవంబర్ 6న ఓ పాప కూడా జన్మించింది. ఈ పాపకు రాహా అనే పేరు కూడా పెట్టారు. అయితే రాహా పుట్టినప్పటినుంచి ఆలియా భట్, రణబీర్ ఇద్దరూ ఈమె ఫేస్ చూపించకుండా జాగ్రత్త పడుతున్నారు.
బయటకు వెళ్లిన కానీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్త పడుతున్నారు ఈ జంట. ఇక ఈ పాప పుట్టి ఏడాది పూర్తవుతుంది. దీంతో ఆలియా ఇటీవల ఇన్స్టా లో రాహా చేతులు మాత్రమే షేర్ చేసింది. ఇక తాజాగా ఆలియా కూతురు ఫోటో నెట్టింట లీక్ అయింది.
రణబీర్ ఎత్తుకుని తన ఎదపై పడుకోబెట్టుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోటో చూసిన ప్రేక్షకులు…” పాప చాలా ముద్దుగా ఉంది. వీరిద్దరికీ తగిన కూతురు పుట్టింది. సో క్యూట్ “.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.