జుట్టును ఒత్తుగా, స్మూత్ గా చేసే Vitamin E ఆహారాలు ఇవే…!!

సాధారణంగా ప్రతి ఒక్కరూ జుట్టు ఒత్తుగా, సిల్కీ గా ఉండాలని కోరుకుంటారు. ఇది అమ్మాయిలు ఒక్కరే కోరుకోరు.. అబ్బాయిలు సైతం కోరుకుంటారు. మరి దీనికి కావాల్సింది Vitamin E పోషకాలు. ఏ ఆహారాలు తింటే Vitamin E.. పోషకాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.

1. నట్స్:
బాదం, నట్స్ నానబెట్టి రోజు ఉదయాన్నే తీసుకుంటే.. Vitamin E పుష్కలంగా అందుతుంది. తద్వారా మీ జుట్టు ఒత్తుగా కూడా అవుతుంది.

2. ఆలివ్ ఆయిల్:
జుట్టును ఒత్తుగా, ఆరోగ్యంగా చేసేందుకు ఆలివ్ ఆయిల్ సహాయపడుతుంది. ఆలివ్ ఆయిల్ లో Vitamin E పుష్కలంగా ఉంటుంది.

3. ఆకుకూరలు:
ఆకుకూరలలో Vitamin E కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పాలకూర, తోటకూర లాంటి ఆకుకూరలు మీ జుట్టును ఒత్తు చేయడానికి సహాయపడతాయి.

4. సీ ఫుడ్:
సి ఫుడ్ తింటే జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటుంది. ఇందులో Vitamin E పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

5. బొప్పాయి:
బొప్పాయిలో సహజ నూనెలు అధికంగా ఉంటాయి. తద్వారా జుట్టు దృఢంగా పెరగడానికి సహాయపడతాయి.

ఈ ఆహారాలు వారం పాటు తిని చూడండి మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఫుడ్ తో మీ జుట్టుని దృఢంగా చేసుకోవచ్చు.