యాంకర్ గా తన సట్టా సత్తా చాటుకున్న మలయాళీ బ్యూటీ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో దశాబ్దాలుగా మోస్ట్ వాంటెడ్ ఫిమేల్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ.. కొడుకు రోషన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాకి సంబంధించిన మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రోషన్ మొదటి సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశాడు.
మూవీ టీమ్‌కు విషెస్ తెలియజేస్తూ నటుడుగా రోషన్ తనదైన మార్క్ చూపించాలి అంటూ.. తల్లిదండ్రులు సుమా,రాజీవ్ గర్వపడేలా చేయాలంటూ రాసుకొచ్చాడు జక్కన. దానిపై రోషన్ స్పందిస్తూ రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపాడు.. మీ ప్రతీ సినిమా నాపై ఎంతో ప్రభావం చూపిందంటు చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాకి బబుల్గమ్ టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ పేరుకు తగ్గట్టు సంబంధిత పోస్టర్లో బబుల్గమ్ నములుతూ కనిపించాడు రోషన్. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం.
క్షణం, కృష్ణ అండ్ హిస్ లీలా సినిమాలతో మెప్పించిన డైరెక్టర్ రవికాంత్ పేరేపు సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రోషన్ సరసన చెరుకూరి మానస చౌదరి హీరోయిన్గా అలరించబోతుంది. ఆమెకి ఇదే మొదటి సినిమా. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ నెల 10 న ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్‌కు సిద్ధమవుతున్నట్లు మూవీ టీమ్ పేర్కొంది. గతేడాది సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైంది. ఆ ఇవెంట్లో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వ్యాఖ్యాతిగా వ్యవహరించే అవకాశం నాకే ఇస్తారని ఆశిస్తున్న అంటూ సుమ నవ్వులు కురిపించారు.