బిగ్ బాస్ ఇంట్లో తగ్గిన ఎంటర్టైన్మెంట్.. రతిక రీఎంట్రీతో బ్యాలెన్స్..!!

బిగ్బాస్ సీజన్ 7 టైటిల్ ఫేవరెట్ గా రతికా రోజ్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ కేవలం నాలుగో వారంలోనే ఆమె ఇంటి బయట పడింది. మొదట వరుసగా మహిళ కంటెస్టెంట్లను బిగ్ బాస్ తప్పించేశాడు. అదేనండి ప్రజల ఓటింగ్ మేరకే… వారిలో వరుసగా కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతిక ఇలా నలుగురు అమ్మాయిలు ఎలిమినేట్ అయ్యారు. హౌస్ లోకి 14 మంది ఎంట్రీ ఇస్తే అందులో 10 మంది మాత్రమే మిగిలారు. ప్రస్తుతం హౌస్ లో ముగ్గురు మాత్రమే మహిళా కంటిస్టెంట్లు ఉన్నారు.

దీంతో బిగ్ బాస్ ఇంట్లో బ్యాలెన్స్ తప్పింది అని చెప్పొచ్చు. ఈ సీజన్ చాలా భిన్నంగా ఉంటుందని… ఉల్టా పుల్టా అని ఏదో కథలు చెప్పారు బిగ్ బాస్. కానీ అంతగా ప్రేక్షకులను మెప్పించలేక పోతుంది. గత సీజన్ లాగా ఈ సీజన్ కూడా ఫ్లాపే అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హౌస్ లో సభ్యుల సంఖ్య తక్కువగా ఉండడంతో గేమ్ చప్పగా నడుస్తుంది. సభ్యులు నిండగా ఉన్నప్పుడు అయితే గొడవలు, ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆదివారం మరో ఏడుగురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ లోకి అడుగుపెడుతున్నారు.

వీరిలో రతిక కూడా రీ ఎంట్రీ ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. రతికాకు రీ ఎంట్రీ అవకాశం బిగ్ బాస్ ఇవ్వాలని సోషల్ మీడియాలో ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 2 సమయంలో నూతన్ నాయుడుకు రీ ఎంట్రీ అవకాశం కలిగించిన విషయం మనందరికీ తెలిసిందే. అదే విధంగా రతికాకు కూడా మరో అవకాశం ఇవ్వాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రీ ఎంట్రీ అనేది బిగ్ బాస్ అనుకుంటే జరగడం ఖాయం. ఎందుకంటే ఉల్టా పుల్టా అని ముందే చెప్పారు కదా.. సో ఈ లెక్కన హౌస్ లో రోజ్ గేమర్ నింపేందుకు ర‌తికాను తీసుకునే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.