రవితేజ రిజ‌క్ట్ చేసిన‌ స్టోరీతో హిట్ కొట్టిన ప్రభాస్.. మూవీ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో దూసుకుపోతున్న ప్రభాస్ హిట్ సినిమాలలో అనుష్క హీరోయిన్‌గా నటించిన మిర్చి కూడా ఒకటి. ఈ సినిమాతో కొరటాల శివ డైరెక్టర్గా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ టాక్ అందుకున్నాడు. అయితే మొదట ఈ సినిమాను రవితేజతో రూపొందించాలనుకున్నాడట కొరటాల.

భద్ర సినిమాకు మాటలు అందించిన కొరటాల ఆ క్రమంలో రవితేజ తో ఉన్న చనువుతో రవితేజకు ముందుగా కథను వినిపించాడట. అయితే రవితేజ ఆ స్టోరీ అంతకుముందు తాను నటించినా భద్రా సినిమాకి సిములర్‌గా ఉందని ఉద్దేశంతో స్టోరీని రిజెక్ట్ చేశాడు. తర్వాత కొరటాల శివ ఈ కథను ప్రభాస్‌కు వినిపించడం ప్రభాస్ అప్పటికే బాహుబలి సినిమాకు కమిటీ అవడంతో సినిమా చేయాలా వద్దా అని రాజమౌళి దగ్గర క్లారిటీ తీసుకున్నాడట‌.

బాహుబలి సినిమాకి ఇంకా చాలా టైం పడుతుంది అని రాజమౌళి చెప్పడంతో ఆ గ్యాప్ లో మీ్చి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ప్రభాస్. ఈ మూవీ బ్లాక్ బాస్ట‌ర్‌ అవడంతో మహేష్ బాబుని హీరోగా పెట్టి శ్రీమంతుడు సినిమా రూపొందించాడు. ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. తర్వాత వరస సినిమాలను రూపొందిస్తూ మంచి క్రేజ్‌తో కొనసాగుతున్నాడు కొరటాల శివ. ఈయన దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాలు హిట్లుగా నిలిచాయి. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొరటాల.