మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. యాంకర్ గా బుల్లితెరపై అడుగుపెట్టిన నిహారిక.. తర్వాత వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇక కెరీర్ స్టార్టింగ్ లో జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకొని.. అనంతరం కొద్ది రోజులకే వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది నిహారిక.
ఈ క్రమంలోనే మరోసారి హాట్ టాపిక్ అయ్యింది మెగా డాటర్. ఇటీవల నిహారిక అమెరికా వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే.. సినిమాల కోసం కోర్సు నేర్చుకునేందుకు అమెరికా వెళ్ళిందని చెప్పినా.. వరుణ్, లావణ్య పెళ్లికి అడ్డుగా లేకుండా ఉండటం కోసం అక్కడకు వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఇష్టంగా పెళ్లి చేసుకుని చైతన్యతో విడిపోయిన ఏ మాత్రం బాధ లేకుండా ఎలా ఉండగలుతోందని అందరూ అనుకుంటుండగా.. చైతన్య ను మర్చిపోయేందుకు నిహారిక ఓ కుక్కను పెంచుకుంటుందని.. అందుకే ఆమె ఎక్కడికి వెళ్ళినా ఆ కుక్కను వెంట తీసుకుని వెళుతుందని సోషల్ మీడియాలో అసభ్యంగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.