ప్రస్తుతం టాలీవుడ్ లెజెండ్రీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రెండు సినిమాలు ఓకే చేసి మెగా ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. వీటిలో మెగా ఫ్యాన్స్ అంతా భారీ సినిమా మెగా 157 కోసం చాలా ఎక్సైట్ గా ఉండగా చిరు ఇక స్ట్రెయిట్ సబ్జెక్ట్లు మాత్రమే చేసే పనిలో ఉన్నారు. అలా పలువురు యువ దర్శకులకే అవకాశం ఇస్తున్న మెగాస్టార్ తన లైనప్ లో దర్శకుడు మారుతి కి కూడా అవకాశం ఇచ్చాడట.
మారుతి రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు. తను చిరంజీవి గారితో సినిమా చేయాల్సి ఉందని.. ఆయన కూడా ఓకే చెప్పారని తెలిపాడు. ఇక ఈ సినిమా చిరు మార్క్ ఎంటర్టైనర్ తరహాలో ప్లాన్ చేశామని తన టైమింగ్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఒక ఘరానా మొగుడు తరహాలో ఉంటుందని మారుతి రివీల్ చేశాడు.
దీంతో మెగాస్టార్ లైనప్ లో మారుతి కూడా ఉన్నాడని ఫిక్స్ అయింది. ఇక ఇప్పుడు మారుతీ అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సూపర్ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అనంతరం చిరంజీవితో సినిమా చేయబోతున్నాడట. ప్రస్తుతం మారుతి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.