ఆ కమెడియన్ హీరోగా కేసీఆర్ మూవీ.. ట్విస్ట్ అదుర్స్..

తెలంగాణలో ఎన్నికలు హీట్ మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎలక్షన్, నోటిఫికేషన్ ఇచ్చేశారు. కొన్ని రోజుల్లో నామినేషన్ ఎన్నికలు, కౌంటింగ్ అంటూ హడావిడి నెలకొంటుంది. సరిగ్గా ఇలాంటి టైం లో ఓ క‌మెడియ‌న్‌ తన కొత్త మూవీ టైటిల్ అనౌన్స్ చేశాడు. దానికి కేసీఆర్ అని పేరు పెట్టడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇంతకీ ఆ సినిమా స్టోరీ ఏంటి.. హీరో ఎవరు.. అంటూ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

కమెడియన్ రాకేష్ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన రాకేష్‌ తర్వాత జబర్దస్త్ కామెడీ షో లో ఎంట్రీ ఇచ్చి స్టార్ కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. రాకింగ్ రాకేష్ అయ్యాడు. ఇక ఇటీవల హీరోగా సినిమాలో నటిస్తున్న సంగతి ప్రకటించిన రాకేష్.. తాజాగా కేసీఆర్ టైటిల్ తో పోస్టర్ రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్లో కేసీఆర్ ఫేస్ రివిల్ చేయలేదు కానీ లుక్ చూస్తుంటే ఆయనదే అనిపిస్తుంది.

అలానే కేసీఆర్ అంటే కేశవ చంద్ర రమావత్ అని తెలుస్తుంది. ఈ పోస్టర్ చూస్తుంటే తెలంగాణ బ్యాక్ డ్రాప్ అనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో రాజకీయానికి సంబంధం ఉందా లేదా హైప్ కోసమే ఆ టైటిల్, పోస్టర్ అలా డిజైన్ చేశారా అనే విషయం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది.