సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు శోభన్ బాబు. తను ఇండస్ట్రీకి వచ్చిన ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ.. ఎన్టీఆర్ గారి ప్రోత్సాహంతో ఆయన సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉండేవాడు. అలాంటి సమయంలో సోలో హీరోగా కూడా అతనికి కొన్ని సినిమాల్లో అవకాశాలు లభించాయి. అతను ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరో రేంజ్ ని అందుకున్నాడు. ఈయన కృష్ణతో కలిసి చాలా మల్టీ స్టార్ సినిమాల్లో నటించాడు. శోభన్ బాబు సినిమాలు అంటే అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా చూసేవారు.
ముఖ్యంగా సోగ్గాడు, గోరింటాకు వంటి సినిమాలు సూపర్ హిట్గా నిలిచాయి. ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మ రథం పట్టారు. అలాంటి శోభన్ బాబు గారిని ఒకప్పటి స్టార్ హీరోయిన్.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారి అమ్మగారు ఘోరంగా అవమానించిందట దానికి కారణం ఎంటో చూద్దాం. శోభన్ బాబు ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెడుతున్న సమయంలో జయలలిత తమిళ్లో ఒక్క ఎంజీఆర్ తోనే 5 సంవత్సరాలలో 32 సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ఆ సమయంలో శోభన్ బాబు మీడియం రేంజ్ హీరోగా ఉన్నాడు.
ఒక సినిమాలో శోభన్ బాబుకి జోడిగా జయలలితని తీసుకుందామని మేకర్స్ అనుకున్నారు. కానీ అప్పటికే తమిళ్లో జయలలిత స్టార్ హీరోయిన్గా ఉంది. కాబట్టి మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చెయ్యను అని చెప్పిందట. దీంతో శోభన్ బాబు చాలా బాధపడ్డాడు. ఇక అప్పటి నుంచి ఆయన ఏ సినిమా చేసిన అందులో జయలలితని హీరోయిన్గా పెట్టుకుని ఒక సినిమా అయినా చేయాలనుకునే వాడట. అయితే శోభన్ బాబుతో సినిమా చెయ్యను అని జయలలిత చెప్పలేదు.. అప్పుడు జయలలిత డేట్స్ వాళ్ళమ్మ అయినా సంధ్య గారు చూసేవారు కాబట్టి ఆమెనే జయలలిత శోభన్ బాబుతో సినిమా చెయ్యొద్దు అని చెప్పిందట.
ఈ విషయాన్ని తర్వాత శోభన్ బాబు మేనేజర్ శోభన్ బాబుకి చెప్పాడు. ఒక స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలో జైలలిత మీడియం రేంజ్ ఉన్న శోభన్ బాబుతో సినిమా చేస్తే తన క్రేజ్ పడిపోతుంది అని చెప్పి వాళ్ళ అమ్మనే ఆ సినిమాను క్యాన్సిల్ చేసింది. దీంతో అప్పటినుంచి శోభన్ బాబు ఆమెతో కనీసం ఒక సినిమా అయినా చేయాలని చూశాడు. అయితే ఆ తర్వాత శోభన్ బాబు స్టార్ హీరో అయ్యాక జయలలితతో చాలా సినిమాలు చేశాడు. కానీ జై లలిత వాళ్ళ అమ్మ అన్న మాటలు ఆయనని బాధపెట్టాయట.