తన తల్లి గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టిన మంచి లక్ష్మి..!!

మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. మొదట ఇంగ్లీష్ సినిమాల్లో నటించిన ఈమె తరువాత ” అనగనగా ఓ ధీరుడు ” సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది. దీంతో వచ్చిన ప్రతి ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది.

ఇక మూవీస్ మాత్రమే కాకుండా అనేక సేవ కార్యక్రమాలు కూడా చేపడుతుంది లక్ష్మి. ఇదిలావుంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ తన తల్లి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది. మంచు లక్ష్మి మాట్లాడుతూ…” మా అమ్మ ఎన్నడూ జ్యువెలరీ కొనలేదు. ఇప్పటికీ కూడా చాలా సన్నటి మాంగళ‌ సూత్రం మాత్రమే ధరిస్తుంది.

అంత సన్నని తాడు అసలు ఉంటుందా.. అది ఎక్కడ దొరికిందో కూడా నాకు తెలియదు. మా అమ్మకు నగలపై అసలే వ్యామోహం ఉండదు. మేము పెద్దయ్యాక నల్లపూసల గొలుసులు వంటివి వేసుకుంటుంది. కానీ చీరలు మాత్రం విపరీతంగా కొనుక్కుంటుంది ” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మంచు లక్ష్మి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.