బిగ్ బాస్ లో నాలుగో వారం దాదాపు అందరూ నామినేట్ అయిపోయారు. పవర్ అస్త్ర ఉన్న ముగ్గురు తప్పించి అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ తాజాగా బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పటివరకు ఇచ్చిన పవర్ అస్త్రలు అన్ని లాగేసుకున్నాడు. అలానే క్యాప్టెన్సీ టాస్క్ కోసం గేమ్స్ మొదలు పెట్టాడు. దీంతో మొత్తం ఆగమాగం అయిపోయింది. ఇంతకీ మంగళవారం ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. నామినేషన్స్ పూర్తి కావడంతో సోమవారం ఎపిసోడ్ పూర్తయింది.
ఆ తర్వాత కిచెన్‌లో గౌతమ్, శుభశ్రీ మాట్లాడుతున్న టైం లో మంగళవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ఇక అందరిని ఒకచోట కూర్చోపెట్టి బిగ్‌బాస్ పెద్ద ఫిట్టింగ్ పెట్టాడు. ఇప్పటివరకు పవర్ అస్త్ర ఉన్న శోభా శెట్టి, సందీప్, ప్రశాంత్ వాటిని తిరిగి ఇచేయాలని చెప్పాడు. దీంతో వీళ్ళు ముగ్గురు తిరిగి ఇచ్చేశారు. శివాజీ మాత్రం శునకానందం పొందాడు. శివాజీ ఇలా చేయడంపై శోభా శెట్టి తనలో తానే అసహనం వ్యక్తం చేసింది. గత నాలుగు వారాలు కూడా పవర్ అస్త్ర ఉన్నవారు గేమ్స్ ఆడలేదు. ఇప్పుడు ఎవరి దగ్గర పవర్ అస్త్ర లేదు కాబట్టి అందరూ ఆడేలా బిగ్ బాస్ గేమ్ డిజైన్ చేశాడు.
ఇందులో ఈ ఇంట్లో అత్యంత దగ్గరైన వారు, మీ నమ్మకాన్ని గెలుచుకున్న వారు, మీ వెన్నుగా నిలబడిన వారు, మీ బడ్డీస్ ఎవరో తెలుసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పాడు. ఈ ప్రక్రియలో మీ బడ్డీస్తో జంటలుగా విడిపోవాల్సి ఉంటుందని.. మీరు తీసుకునే నిర్ణయం ఈ వారం మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుందని క్లారిటీ ఇచ్చాడు. దీంతో గౌతమ్-శుభశ్రీ , శివాజీ-ప్రశాంత్, అమర్దీప్-సందీప్, ప్రియాంక-శోభ శెట్టి, యావర్-తేజ లుగా విడిపోయారు. అయితే ఈ గేమ్ లో భాగంగా స్మైల్ ఆకారంలో ఉన్న బొమ్మల్లో నంబర్స్ ఉన్న కొన్ని దంతాలను ఉండవు.
లైన్లో ఉన్న రెండు ఏరియాల నుంచి పాకుకుని వెళ్లి, యాక్టివిటీ ఏరియాలోని ప్లేసుల్లో నెంబర్స్ వెతకాలి. వాటిని తమకిచ్చిన పళ్ల ఆకారంలో అతికించి.. అది పూర్తయిన తర్వాత గంట మోగించాలని చెప్పాడు. ఆటలో గెలిచిన వాళ్ళు మొదటి కెప్టెన్సీ ని దకిచుకోవడంతోపాటు సూపర్ ఇమ్యూనిటీ లభిస్తుందని బిగ్ బాస్ ఆదేశించాడు. అలానే ఈవారం వచ్చే వారం నామినేషన్స్ నుంచి సేవ్ అవుతారని కూడా చెప్పాడు. దీంట్లో ముందు ప్రశాంత్-శివాజీ గంట మోగించారు.
అమర్-సందీప్ రెండో స్థానంలో నిలిచారు. కానీ ప్రశాంత్-శివాజీ సరిగ్గా పెట్టలేదని సంచాలక్ గా వ్యవహరించమని శోభా, యావర్‌కి చెప్పినందున వారిద్దరూ ఒక డెసిషన్ తీసుకున్నారు. వాదోపవాదాలు అనంతరం మొదట
1.గౌతమ్-శుభశ్రీ
2.అమర్-సందీప్
3. శివాజీ-ప్రశాంత్
4.శోభా-ప్రియాంక
5.యావర్-తేజ ఈ స్థానాల్లో నిలిచారు.