నందమూరి మోక్షజ్ఞ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మోక్షజ్ఞ సిని ఎంట్రీ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుండగా మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ప్రకటన గురించి దసరా పండగ కానుకగా క్లారిటీ రానుందని తెలుస్తుంది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరు? నిర్మాత ఎవరు? అనే ప్రశ్నలకు సంబంధించి సమాధానం దొరకనుందని తెలుస్తుంది. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ భారీ లెవెల్లో ఉండనుందని టాక్.
మోక్షజ్ఞకు జోడిగా శ్రీ లీల నటించే ఛాన్స్ అయితే ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. భగవంత్ కేసరి సినిమా రిలీజ్ సమయంలోనే నందమూరి ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్ అంటూ జరుగుతున్న ప్రచారం అభిమానులకు ఊహించని స్థాయిలో సంతోషాన్ని ఇస్తుంది. వరుస విజయాలు సాధిస్తున్న బాలయ్య.. మోక్షజ్ఞ కెరీర్ కూడా అదే విధంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. నందమూరి మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ సొంత బ్యానర్ లో తెరకెక్కే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.
తొలి సినిమాతోనే పాన్ ఇండియా రేంజ్ లో ఇండస్ట్రీని షేక్ చేయాలని మాస్, యాక్షన్ హీరోలను సైతం అలరించే విధంగా ఈ సినిమా ఉంటుందని సమాచారం. మోక్షజ్ఞ తొలి సినిమాలో బాలయ్య కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడట. ఇప్పటికే తన లుక్ ను మార్చుకున్న మోక్షజ్ఞ వరుస సినిమాలలో నటించేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మోక్షజ్ఞ రేంజ్ రాబోయే రోజుల్లో మరింత పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మోక్షజ్ఞ తన సినిమాలు ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించి విజయం ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తుంది.