” బిగ్ బాస్ 7 ” వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ గురించి 10 ఆసక్తికర విషయాలు…!!

బిగ్ బాస్ 7 ప్రస్తుతం రసవత్తంగా సాగుతుంది. గడిచిన ఐదు వారాల్లో కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామిని, రతిక, శుభ శ్రీ ఎలిమినేట్ అయ్యారు. అయితే ఊహించని విధంగా నిన్న ఆదివారం ఎపిసోడ్లో కొందరు కంటిస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. వీళ్ళే భోలే సావళి, నయని , అశ్విని శ్రీ, అర్జున్ అంబటి, పూజా మూర్తి వీళ్ళు హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. వాళ్లలోప్రేక్షకులకి తెలిసిన వారు కొందరు మాత్రమే. ఆ తెలిసిన వాళ్లు లిస్టులో నయని పావని ఒకరు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు ఈమెను ఇట్టే గుర్తు పడతారు. ఆమె గురించి పది ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1. నయని పావని 1998 అక్టోబర్ 23న జన్మించింది. ఆమె తెలంగాణాకు చెందిన అమ్మాయి.

2. ఆమె అసలు పేరు సాయి పావని రాజు. ఆమె హిందూ కుటుంబానికి చెందిన అమ్మాయి.

3. ముందుగా ఆమె టిక్ టాక్ వీడియోలతో కెరీర్ ను ప్రారంభించింది. ఆమె చేసిన టిక్ టాక్ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. అలాగే యూట్యూబ్లో కూడా పలు షార్ట్ ఫిలిమ్స్
తో సందడి చేసింది.

4. సమయం లేదు మిత్రమా, ఎంత ఘాటు ప్రేమ, పెళ్లి చూపులు 2.0, మిత్రమా ఇలా పలు షార్ట్ ఫిలిమ్స్ లో ఆమె నటించడం జరిగింది.

5. అంతేకాకుండా నయని పావని..ఢీ షో లో కూడా పాల్గొని ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

6. చిత్తం మహారాణి , సూర్యకాంతం వంటి సినిమాల్లో ఆమె నటించింది. ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కాబట్టి ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించలేదు.

7. అందానికి అందం, దానికి మించి టాలెంట్ ఉన్న ఈ బ్యూటీ కి అవకాశాలు అయితే ఆశించిన స్థాయిలో రాలేదు.

8. అందుకే ఆమె బిగ్ బాస్ 7 షోలో ఎంట్రీ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ షో ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైతే.. వరుస సినిమా అవకాశాలు కూడా వస్తాయని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తుంది.

9. నయని పావని చూడటానికి చాలా అందంగా ఉంటుంది. నిత్యం ఆమె గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఆమె అందాన్ని ఆరాధించేవారు సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది.

10. సోషల్ మీడియాలో ఈమె యాక్టివ్గానే ఉంటుంది. ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 6 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె పోస్ట్ చేస్తే గ్లామర్ ఫోటోలకు లక్షల్లో లైకులు వర్షం కురుస్తుంటారు. మరి ఈమె బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని వారాలు కొనసాగుతుందో చూడాలి .