అన్నం తింటే బరువు పెరుగుతారా.. క్లారిటి ఇదే?

ఈమధ్య అన్నం తినడం బరువు పెరిగేందుకు కారణం అవుతుందన్న ఒక వాదన చాలా ప్రాచుర్యంలో ఉంది. బరువు తగ్గేందుకు అన్నాన్ని పూర్తిగా దూరం పెట్టే పనిలేదని నిపుణులు చెబుతున్నారు. అన్నం మనకు సంస్కృతిలో భాగం. మన ఆరోగ్యానికి గుర్తింపు. అందుకే అన్నం తింటేనే కడుపు నిండిన భావన కలుగుతుంది. అన్నం పూర్తిగా మానేస్తే చర్మం, జుట్టు, జీర్ణ వ్యవస్థ దెబ్బతింటాయి.

స్థానికంగా దొరికే ఏ బియ్యం అయినా అక్కడి వారి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కేరళ వారికి నవారా, బీహారీలకు మార్చారైస్, మహారాష్ట్రయులకు వాడా కోలం బీయ్యం ఏదైనా స్థానిక బియ్యం మంచివి. పూర్వికుల నుంచి ఇలాంటి ఆహారపు అలవాట్లు మనకు వచ్చాయో అవి మనకు మేలు చేసేవి అని నిపుణుల సలహా. కాబట్టి డేటింగ్ పేరుతో ఆకలితో ఉండకండి.