” వీరమల్లు ” షెడ్యూల్ పరిస్థితేంటి.. అసలేం జ‌రుగుతుంది..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ సినిమా ” హరిహర వీరమల్లు “. ఈ సినిమా నుంచి పవన్ పుట్టినరోజు సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ విడుదలై ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ మూడో వారం నుంచి పవన్ ఈ సినిమాకి డేట్స్ కేటాయించాడని టాక్ నడిచింది.

అయితే.. ఏపీలో జరుగుతున్న తాజా పరిణామాలను బట్టి.. పవన్ ” హరిహర వీరమల్లు ” షెడ్యూల్ ను మళ్లీ పోస్ట్ ఫోన్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. కాగా మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది.

ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించ బోతున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా పవన్ నటిస్తోన్న తొలి పాన్ ఇండియా మూవీ ఇది.