ఇంట్లోకి దోమలు రానీకుండా చేసే సింపుల్ టిప్స్ ఇవే..!

ఇటీవల రోజుల్లో దోమ కాటు కారణంగా డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా లాంటి ఎన్నో సమస్యలతో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. వాన కాలంలో అయితే దోమలు విచ్చలవిడిగా ఇళ్లలోకి ప్రవేశించి అందరిపై అటాక్ చేస్తూ ఉంటాయి. దీంతో దోమల భారీ నుంచి తప్పించుకోవడానికి లోషన్లు, క్రీమ్‌లు, స్ప్రేలు, దోమలు బ్యాట్లు, ఆల్ అవుట్ లు అంటూ చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల కూడా దోమలు రావట.

మరి ఆ మొక్క‌లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పల్లెటూరులో ఉండే వాళ్లకు గుర్రపు డెక్క అంటే ఐడియా ఉంటుంది. ఇది కాలువల్లో ఎక్కువగా దొరుకుతుంది. ఈ మొక్క యాంటీ వైరల్.. ఇంకా యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ మొక్క నుంచి ఒక్కలాంటి ఘాటు వాసన వస్తుంది. ఈ వాసన ప్రభావంతో దోమలు చాలా దూరంగా ఉంటాయి. అలాగే వేపలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయని అందరికీ తెలుసు. మన ఇంట్లో చిన్న కుండీలో వేప మొక్కను పెట్టుకున్న కూడా దోమలు అసలు ఇంట్లోకి రావు.

అలాగే బంతిపూల మొక్కలను పెట్టుకున్న తులసి మొక్క ఇంట్లో ఉన్నా కూడా చుట్టుపక్కల ఉన్న పర్యావరణం శుద్ధి అయ్యి దోమలు రావు. దోమలు, కీటకాలు రాకుండా చేసే మొక్కల్లో కచ్చితంగా అజరాటం కూడా ఒకటి. ఇక ఈ మొక్కకు బ్లూ లేదా వైట్ కలర్ లో పువ్వులు వస్తాయి. అలాగే ఇది కూడా ఒక ఘాటు వాసనను కలిగి ఉండడం కారణంగా ఈ మొక్క ఇంట్లో ఉంటే ఆ ప్రాంతానికి దోమలు చాలా దూరంగా ఉంటాయి.

అదేవిధంగా పుదీనా రకానికి చెందిన క్యాట్నిప్ అనే మొక్క సూర్యుని వెలుతురు నీడలో కూడా పెరుగుతుంది. ఈ మొక్క నుంచి కూడా ఘాటు వాసన వెలుపెడుతుంది ఇది ఉన్న కూడా దోమలు ఇంట్లోకి రావట. ఈ పై ఉన్న మొక్కలలో ఏదైనా మీ ఇంటి వాతావరణం లో పెంచుకుంటే ఆ ఘాటు వాసనకు.. అలాగే పర్యావరణాన్ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి దీంతో దోమలు దరిచేరకుండా ఉంటాయి.