రూ.500 కోట్లకు పైగా భారీ కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే…!!

ప్రస్తుతం భారతీయ సినిమా రేంజ్ ఎవరూ ఊహించిన విధంగా ఉంది. భాషతో సంబంధం లేకుండా ప్రతి ఇండస్ట్రీ నుంచి గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు సినిమాలు వస్తున్నాయి. అలా వస్తున్న సినిమాల్లో కంటెంట్ బాగుంటే కేవలం అతి తక్కువ రోజుల్లోనే 500 కోట్ల కంటి ఎక్కువ భారీ కలక్షలన్లు సాధిస్తున్నాయి.

ప్రస్తుత రోజుల్లో ఒక సినిమాకు 500 కోట్ల క‌లెక్ష‌న్లును సాధించడం అంటే చిన్న విషయం కాదు. ప్రస్తుతం భారతీయ సినిమా దగ్గర రీసెంట్ టైమ్స్ లో 500 కోట్లకు పైగా భారీ కలెక్షన్ రాబట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి.కానీ భారతీయ సినిమాల మార్కెట్ గత కొన్ని ఏళ్లుగా ఊహించని రేంజ్ లో పెరిగింది. ఇటీవల రూ.500 కోట్ల రూపాయల వసూళ్లను దాటేసిన చిత్రాలు చూసినట్లయితే.

కేజిఎఫ్-2 సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే ఈ అరుదైన ఫీట్ ను దక్కించుకుంది. ఆ త‌ర్వాత‌ దంగల్ (13 రోజుల్లో), టైగర్ జిందా హై (బాలీవుడ్ మూవీ), ఆర్ఆర్ఆర్, సంజు, గదర్ 2, బాహుబలి 2, పఠన్ సినిమాలు సైతం పెద్ద మొత్తంలో కలెక్షన్లు రాబట్టాయి. ప్యూచర్ లో రాబోయే మూవీస్ రూ.2000 కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో వసూళ్లు సాధించి ఊహించని స్థాయిలో రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.