చిరు సినిమాకు హీరోయిన్లు లేరా.. ఎంత కష్టం సామీ..!!

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి156, 157వ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగ‌తి తెలిసందే. చిరంజీవి 156 సినిమా తన కూతురు సుస్మిత ప్రొడక్షన్లో చేయబోతున్నాడు చిరు. సోగ్గాడే చిన్నినాయన డైరెక్టర్ కళ్యాణ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఏమీ రాలేదు. కానీ 157వ‌ మూవీ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి రీసెంట్గా పోస్టర్ రిలీజ్ అయింది. మొద‌టి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన వశిష్ట తన రెండో సినిమాలో చిరంజీవితో ఫిక్స్ చేసుకున్నాడు.

వంశీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా స్ట్రైట్ సినిమా కావడం.. ఈమధ్య రీమేక్ సినిమాలు చేసి మెగా ఫాన్స్ అసంతృప్తి కలిగించిన చిరుకి ఒరిజినల్ కథ అది కూడా రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉండడంతో వెంటనే చిరు ఈ సినిమాకు ఓకే చేసేసాడట‌. వశిష్టత సినిమా ఆడియన్స్ కి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందని టాక్. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే సినిమా షూటింగ్ మొదలవుతోంది. చిరు ఓ అడ్వెంచర్స్ ప్రిక్ష‌న్‌ కథతో వస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ దశలోనే ఉన్నా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

వాల్తేరు వీర‌య్య సక్సస్ అందుకున్నా గాడ్ ఫాదర్, భోళా శంకర్ లాంటి వరుస ఫ్లాప్‌లు అందుకోవడంతో చిరు ఇక మీద‌ట స్టోరీ విష‌యంలో అచితూచి అడుగు వేస్తున్నాడ‌ట‌. ముఖ్యంగా రొటీన్ సినిమాలు కాకుండా వెరైటీ కథలను ఎంచుకుంటున్నాడు.. మెగా 157 సినిమా క్యాస్టింగ్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఇక‌ హీరోయిన్ విషయంలో ఇంకా వేట కొనసాగుతునే ఉంది. సీనియర్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు యంగ్ హీరోయిన్స్ ఇంట్రెస్ట్ చూపకపోవడం.. చిరు హీరోయిన్స్ గా ఇప్పటికే నయనతార, తమన్నాలు నటించడంతో ఎలాగూ ఫిక్షన్ కదా కాబట్టి కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారు. మరి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అవుతారు అనేది ఇంకా క్లారిటీ లేదు.