ప్రేక్షకుల ఆదరణతోనే ఎదిగానంటూ…. సెన్సేషనల్ కామెంట్స్ చేసిన యంగ్ హీరో….!!

నవీన్ పోలిశెట్టి ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఫ్రెండ్, సహ నటుడు విజయ్ దేవరకొండ తో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు నవీన్ పోలిశెట్టి. ” సినీ కెరీర్ ప్రారంభంలో… ఆ తర్వాత హీరోగా ఎదుగుతున్న క్రమంలోనూ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము… ముంబైలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు.. కడుపునిండా భోజనం కూడా దొరికేది కాదు.

చేతిలో డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడ్డాము. ” లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” సినిమాలో నేను, విజయ్ చిన్న రోల్స్ చేశాం. ఆ పాత్రల కోసం ఇద్దరం కలిసి ఆడిషన్ కు వెళ్లినప్పుడు మాకు ఇచ్చిన పాత్రల విషయంలో చాలా డిస్ప్పాయింట్ అయ్యాం. అక్కడి నుంచి ఈ స్థాయికి ఎదిగాము.. ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాం.

ఇప్పటికీ మేము ఇద్దరం టచ్ లోనే ఉంటాం “. అంటూ ఆశ‌క్తిక‌ర‌ కామెంట్స్‌ చేసాడు నవీన్ పోలిశెట్టి. చివరగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాత్రం తనను ఎంతో బాధపెట్టాడని.. ఆ ఘటన నుంచి కోలుకోవడానికి రెండు నెలలు పట్టిందని చెప్పుకొచ్చాడు నవీన్.