డేటింగ్, పెళ్లి వార్తలతో కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తమన్నా భాటియా తాజాగా నెటిజన్ల తీరుపై ఫైర్ అయ్యింది. తాజాగా చెన్నై వేదికగా జరిగిన ఫ్యాన్స్ మీట్ లో పాల్గొన్న ఆమె అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెబుతూ ప్రేక్షకులని అలరించింది.
ఈ క్రమంలోనే నెగిటివిటీని మీరు ఎలా ఎదుర్కొంటారు? అనే ప్రశ్నకు బదిలీస్తూ.. నాపై విమర్శలు వచ్చినప్పుడు ఎందుకిలా జరుగుతుందని ముందు ఆలోచిస్తా.. అయితే దేన్నైనా కొంతమంది ప్రశంసిస్తే మరికొందరు విమర్శిస్తారు. అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. దీనికి బాధపడాల్సిన అవసరం లేదు. వ్యతిరేకతను నేను ఎక్కువగా పట్టించుకోను అంటూ చెప్పుకొచ్చింది.
అలాగే మీరు మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటున్నారు? తమిళ్ అబ్బాయిలు మీకు నచ్చలేదా? అంటూ ఓ యువకుడు కాస్త వెటకారంగా అడిగాడు. దీంతో తమన్నా నా పేరెంట్స్ ఇలా ఎన్నడు వేధించలేదు. పెళ్లి గురించి వాళ్లకు ఎలాంటి కంగారు లేదు. అయినా మీరు ఎందుకు ఇలా పదే పదే అడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నేనిప్పుడు సంతోషంగానే ఉన్నాను. కెరీర్, లైఫ్ హ్యాపీ గా సాగుతుంది అంటూ ఫైర్ అయింది తమన్నా. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది.