ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్న శ్రీ లీల… రౌడీ హీరో విజయ్ దేవరకొండకు షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. నటనతో పాటు డాన్స్ తోను అదరగొడుతూ యూత్‌లో తిరగులేని గ్రేస్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ… చేతిలో ఇప్పుడు దాదాపు 9కి పైనే పది సినిమాలు ఉన్నాయి.
అయితే ఒకేసారి అన్ని సినిమాలు సెట్స్ పైకి తీసుకెళ్లడంతో డేట్ అడ్జస్ట్ చేయడం కష్టమైపోయిందట. దీంతో విజయ్ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా నుంచి శ్రీ లీల తప్పుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ” గుంటూరు కారం” తో పాటు ” ఉస్తాద్ భగత్ సింగ్, భగవంత్ కేసరి, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్, ఆది కేశవ వంటి సినిమాలు లైన్లో ఉండగా విజయ్ మూవీకి టైం కుదరకపోవడంతో క్యాన్సిల్ చేసుకున్నట్లు టాక్ నడుస్తుంది. మరో వారంలో దీనిపై అధికారిక ప్రకటన కూడా వెళ్లడయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram