వరల్డ్ వైడ్ ‘ జవాన్ ‘ ఫ‌స్ట్ డే సెన్సేషనల్ ఓపెనింగ్స్ పై ప్రిడక్షన్..!!

ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్‌ నుంచి కూడా భారీ హైప్ నడుమ రిలీజ్ అయిన లేటెస్ట్ పాన్ ఇండియా సినిమానే ‘ జవాన్ ‘. మరి బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా నయనతార హీరోయిన్ గా తమిళ్ యంగ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈ సినిమా నిన్న భారీ స్థాయి అంచనాలు నడుమ విడుదల అయ్యింది.

అయితే దీనికి మునుపటి సినిమా ‘ పఠాన్ ‘ ని ఈ సినిమా పర్ఫార్మన్స్ చేస్తుంది అనుకున్నట్టు గానే ఇప్పుడు ఈ సినిమా టాలీవుడ్ నుంచి మరో రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ నమోదు చేసినట్టుగా సిని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ150 కోట్లకు పైగా గ్రాస్ ని ఇంకా చాలా ఎక్కువే అందుకుంటుంది అని లేటెస్ట్ ప్రిడిక్షన్ వచ్చింది.

దీనితో మరో సెన్సేషనల్ ఓపెనింగ్ షారుక్ నుంచి వచ్చింది అని చెప్పాలి. మరి అఫీషియల్ నెంబర్ అయితే ఎంత ఉంటుందో చూడాలి. ఇక రిలీజ్‌కి ముందే భారీ హైప్ లెచ్చుకున్న ఈ మూకవీ ఇప్ప‌టికే క‌లెక్షన్ల వ‌ర్షం కురిపిస్తుంది. ఇప్పటికే ప‌ఠాన్‌ రికార్డులను బ్రేక్ చేసిన ఈ సినిమా ముందు ముందు ఇంకెన్ని రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.