ఆలీ రెమ్యున‌రేష‌న్ అడిగితే బిర్యానీ చేతిలో పెట్టి పంపేశారా… ఇంత జ‌రిగిందా ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అలీ. దాదాపు ఆగ్ర హీరోలు అందరి సినిమాల్లో నటించి కోట్లాదిమంది ప్రేక్షకుల ఆదరణ పొందిన అలీ ఎంతోమందికి ఫేవరెట్ స్టార్ కమెడియన్‌గా మారాడు. ఎన్నో పురస్కారాలను, అవార్డులను సొంతం చేసుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయమైన అలీ కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించి మెప్పించాడు. ప్రస్తుతం రాజకీయాల్లోకి అడుగుపెట్టి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.

అలీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్న సమయంలో త‌న‌కి జరిగిన అవమానాల గురించి వివరించాడు. అలీ చిన్నతనంలో కొంతమంది బడా ప్రొడ్యూసర్స్ నన్ను చిన్న చూపు చూశారని చెప్పుకొచ్చాడు. ఓ బడ నిర్మాత సంస్థ నా పాత్రకు సంబంధించిన రెండు రోజుల షూటింగ్ పూర్తి చేసుకుని తర్వాత రెమ్యూనరేషన్ ఇవ్వకుండా ఆలీతో ఏముందిలెండి ఒక బిర్యాని పొట్లం ఇచ్చి పంపేయండి అని చెప్పారని వివ‌రించాడు.

వారు చెప్పినట్టే ఏమీ మాట్లాడకుండా బిర్యాని పొట్లం తీసుకొని కామ్ గా వచ్చేసానని చెప్పుకొచ్చాడు.
ఇక మరుసటి రోజు నా రోల్‌కు సంబంధించి షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత నేను షూటింగ్‌కి వెళ్లడం మానేశానని నిర్మాతలు కాల్ చేసి అడిగితే మీరు ఇచ్చిన బిర్యాని తిని పడుకున్నానండి అందుకే రావట్లేదు అంటూ కౌంట‌ర్ వేశాడ‌ట‌ అలీ.