బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతుంది. వరుసగా మూడు రోజులు భారీ కలెక్షన్లు రాబట్టిన జవాన్ మూవీకి.. సోమవారం భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ కారణంగా కలెక్షన్లు భారీగా పడిపోయాయి. ఈ సినిమా 5వ రోజైన సోమవారం..రూ. 30 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.
అయితే ఇది అంతకుముందు శని, ఆదివారాలతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంది. అలాగే ఈరోజు ( మంగళవారం ) కూడా భారత్, శ్రీలంక జట్టు మధ్య మ్యాచ్ ఉండటం వర్కింగ్ డే కావడంతో కలెక్షన్లు మరింత తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే జవాన్ నిర్మాతలు మాత్రం… సోమవారం ఈ కలెక్షన్లు రావడం పెద్ద విషయం అంటున్నారు. జవాన్ మొదటిరోజు ఇండియాలో 75 కోట్లు, రెండో రోజు రూ. 58.23 కోట్లు, శని, ఆదివారాల్లో అత్యధికంగా రూ. 77.83 కోట్లు, రూ. 80.1 కోట్లు రాబట్టింది.
బాక్స్ ఆఫీస్ నుంచి సోమవారం నాటి వసూళ్ను కలుపుకుంటే.. టోటల్ ఇండియా నికర వసూళ్లు రూ. 316.16 కోట్లకు చేరాయి. ఈ సినిమా ఓవర్సీస్ నుంచి రూ. 177 కోట్లు రాబట్టింది. కాబట్టి ఐదవ రోజు నాటికి ప్రపంచవ్యాప్తంగా టోటల్ కలెక్షన్లు రూ. 520 కోట్లకు చేరుకుంది. ఈ ట్రెండ్స్ ఇలానే కొనసాగితే జవాన్ సినిమా 1000 కోట్లు కొల్లగొటనుంది.