బాలయ్య తో ఉన్న ఆ కుర్రాడిని గుర్తుపట్టారా.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..?

టాలీవుడ్ లో ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టి స్టార్ హీరో, హీరోయిన్లుగా ఎదిగిన సంగతి తెలిసిందే. అలాగే చాలామంది చైల్డ్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టి ఇప్పటికి కూడా హీరోలుగా అవ్వాలని ట్రై చేస్తున్నారు. ఇక ఇటీవ‌ల సినిమాలతో కాస్త బిజీగా మారిపోయాడు విశ్వ కార్తికేయా.

టాలీవుడ్ లో ఇప్పటి వరకు 50 కి పైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించినా విశ్వ కార్తికేయ బాలకృష్ణ, రాజశేఖర్ మొదలు చాలామంది స్టార్ హీరోల సినిమాల్లో కనపడ్డాడు. బాలకృష్ణ హీరోగా వచ్చిన అది నాయకుడు సినిమాలో కూడా విశ్వ నటించాడు. విశ్వాకి అవార్డులు కూడా బానే వచ్చాయి. ఆయూషి పటేల్ హీరోయిన్‌గా విశ్వ కార్తికేయ హీరోగా ఓ సినిమా రాబోతుంది.

ఈ సినిమా పేరు కలియుగ పట్టణంలో. కట్నం రమేష్, జి మహేశ్వర్, కే చంద్ర రెడ్డి కలిసి ఈ సినిమాను ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. రమాకాంత్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. సినిమాల్లోకి వచ్చి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు విశ్వ కార్తికేయ. ఈ సందర్భంగా విశ్వకు అందరు కంగ్రాట్స్ తెలియజేశారు.