రుచికరమైన బ్రెడ్ హల్వా.. క్ష‌ణాంలో త‌యార్‌.!!

చాలామంది బయట దొరికే బ్రెడ్ హల్వాను ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఇంట్లో చేసుకోవడానికి సరిగ్గా కుదరక బాధపడుతూ ఉంటారు. వారందరి కోసం రుచికరమైన బ్రెడ్ హల్వాను ఇంట్లో సులభంగా తయారు చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:

1.నూనె, ఆఫ్ లీటర్

2. బ్రెడ్, వన్ ప్యాకెట్

3. డ్రై ఫ్రూట్స్, తగినంత

4. నెయ్యి , ఫోర్ స్పూన్స్

5. పంచదార టూ కప్స్

6. యాలిక్కాయలు రెండు

7. కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు

తయారీ విధానం:
ముందుగా బ్రెడ్ ను తీసుకుని.. చుట్టూ ఉన్న బ్లాక్ కలర్ దాన్ని కట్ చేసి వైట్ గా ఉన్నదాన్ని మాత్రమే తీసుకోవాలి. తరువాత స్టవ్ పై బర్నర్ పెట్టి ఆయిల్ వేడి చేయాలి. వేడి అయిన తర్వాత బ్రెడ్ ముక్కలను బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేయించుకున్న వాటిని పక్కన పెట్టి. మరో బౌల్ పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.

ఆ తరువాత ఒక కప్పు పంచదార వేసి అదే గ్లాసుతో రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. దాంట్లో రెండు యాలక్కాయలు వేసి తీగ పాకం వచ్చేదాకా ఉంచాలి. తర్వాత బ్రెడ్ ని అందులో వేసి ఉండలు లేకుండా మిక్స్ చేయాలి. ఆ తర్వాత కాచి చల్లార్చిన పాలు పోయాలి. అలా బాగా ప్రెస్ చేస్తూ ఉండాలి. అప్పుడు బ్రెడ్ ఉండలు లేకుండా అవుతుంది. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసి.. రెండు స్పూన్ల నెయ్యి ను పైన వేసుకోవాలి. ఇలా తయారు చేస్తే చాలా రుచికరంగా ,అందంగా బ్రెడ్ హల్వా తయారవుతుంది.