తిరుపతిలో మరో చిరుత.. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి..!!

పెద్ద తిరుపతి అంటే ఒకప్పుడు భక్తి బావుద్వేగం పుట్టుకొచ్చేది. కానీ ఇప్పుడు భయం వెంటాడుతుంది. పెద్ద తిరుపతి అంటే ఎక్కడ చిరుత ఉందో అని భయపడాల్సిన దుస్థితి పట్టింది. గతంలో ఓ చిన్నారి మృతికి కారణమైన చిరుతని పట్టుకోవడానికి బోన్ పెడితే… ఐదు చిరుతలు దొరికాయి.

స్వామి వారిని దర్శించుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నా జనాల్లో భయం మాత్రం ఏ మాత్రం పోవడం లేదు. తాజాగా పెద్ద తిరుపతిలో బోన్ లో చిక్కింది మరో చిరుత. లక్ష్మి నరసింహ స్వామి ఆలయం దగ్గర చిరుత చిక్కింది. నడక మార్గంలో 28,250 మెట్లు దగ్గర చిరుత పట్టుబడింది.

పట్టుబడిన చిరుతతో సహా ఇప్పటివరకు మొత్తం 6 చిరుతలను అధికారులు పట్టుకున్నారు. చిన్నారి లక్షితాపై దాడి జరిగిన ప్రాంతంలో చిరుత చిక్కింది. ఇక, ఇటీవల వరుసగా చిరుత దాడులు తిరుమల మెట్లు మార్గంలో తీవ్ర కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.