ఒక్క పోస్టుతో హేటర్స్ ని కూడా తన అభిమానుల‌ను చేసుకున‌ అనసూయ..?

సోషల్ మీడియాలో వివాదాలకు కేరాఫ్ గా నిలిచే బ్యూటీ అనసూయ. యాంకర్ గా బుల్లితెరపై అడుగుపెట్టిన ఈ అమ్మడు… ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక సమయం దొరికిన ప్రతిసారి తన అందాలతో.. బోల్డ్ లుక్స్ తో కుర్రాకారుకి నిద్ర లేకుండా చేస్తుంది.

ఈ క్రమంలోనే ఒక్కోసారి తీవ్రమైన విమర్శలు సైతం ఎదుర్కొంటుంది. కానీ తనపై వచ్చే ట్రోల్స్ పట్టించుకుని ఈ అమ్మడు… నెటిజన్లును రెచ్చగొట్టేలా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు పెట్టిన పోస్ట్.. తన హేటర్లను రెచ్చగొట్టేలా ఉంది.

ఈ మేరకు ” ద్వేషించే వారందరికీ ఒక సందేశం. నేను చేసే పని మీకు నచ్చకపోవచ్చు. కానీ నేను చేసేందంతా మీరు చూస్తున్నారు. కాబట్టి ఇప్పటికీ మీరు నా అభిమానులే ” అంటూ పోస్ట్ షేర్ చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్ట్ పై ప్రేక్షకులు రకరకాలుగా స్పందిస్తున్నారు.