విశాల్, ఎస్. జె. సూర్య కలిసి నటించిన సినిమా ” మార్క్ ఆంటోనీ “. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో సోమవారం ” ( సెప్టెంబర్ 15) థియేటర్లో విడుదలైంది. ఇక పబ్లిక్ టాక్ చూస్తే విశాల్ ఇందులో హీరో అయినా.. సూర్య ఒంటిచేత్తో ఈ సినిమాని నడిపించారని అంటున్నారు.
అంతేకాదు ఫస్ట్ ఆఫ్ బాగుందని.. సెకండాఫ్ అంతకుమించి అన్నట్లుగా ఉందని.. స్క్రీన్ ప్లే, మ్యూజిక్ మూవీకి చాలా ప్లస్ అని టాక్. ఇక ఇందులో యాక్టర్స్ సిల్క్ స్మితను చూసిన ఆడియన్స్ షాక్ అవుతున్నారు. అచ్చం స్మితలా కనిపిస్తున్న ఈ అమ్మాయి తమిళ్ యాక్టర్ విష్ణు ప్రియా గాంధి.
సినిమాలో ఆమెను చూసి నిజంగానే సిల్క్ స్మిత యాక్ట్ చేస్తున్నట్లు ఫీల్ అవుతున్నారు ఆడియన్స్. అంతేకాకుండా ఆమె క్యారెక్టర్ రావడానికి ఏఐ టెక్నాలజీ హెల్ప్ తీసుకున్నారా? అనే డౌట్ క్రియేట్ చేశారు మేకర్స్. మొత్తంగా ఈ మూవీ హిట్ కు ఒకంత విష్ణు ప్రియ కూడా కారణమని చెప్పాలి.