‘ పుష్ప ‘ సినిమాతో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం ‘ పుష్ప 2 ‘ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉండగా.. దాదాపు 1000 కోట్లు బిజినెస్ జరుగుతుందని టాక్. ఇక ఈ మూవీ తర్వాత బన్నీ.. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. జాతీయ అవార్డు అనంతరం బన్నీ రేంజ్ మరింత పెరిగింది. అంతేకాదు తెలుగుతో పాటు కోలీవుడ్, మాలీవుడ్ మిగతా అన్ని భాషల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. ఆ భాషల్లో సైతం బన్నీ ఎంట్రీ ఇవ్వాలని అక్కడ అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు.
దీంతో అల్లు అర్జున్ కూడా అక్కడ ఎంట్రీ ఇచ్చేందుకు సరైన కథ కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వరుస హిట్లతో దూసుకుపోతున్న డైరెక్టర్ తో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు బన్నీ రెడీగా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం మేరకు.. రాజారాణి సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న డైరెక్టర్ అట్లీ కుమార్.. విజయ్‌తో వరుసగా సినిమాలు తీసి మూడు సినిమాలతో మంచి విజయాలను అందుకుని హిట్ డైరెక్టర్గా దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోని షారుక్ ఖాన్ హీరోగా ‘ జవాన్ ‘ సినిమాతో బాలీవుడ్ లో సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.
ఈ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకులు ముందుకి వచ్చి సందడి చేయనుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు అట్లీ డైరెక్టర్‌గా టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ మేరకు అల్లు అర్జున్ కి మంచి కథ ఉందని.. వినాలని కోరినట్లు సమాచారం. అదే కనుక నిజం అయితే.. వరుస హిట్లతో దూసుకుపోతున్న డైరెక్టర్ తో బన్నీ కోలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ ఫిక్స్ అయినట్లే అని సమాచారం. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే వేచి చూడాలి.