క్రికెట్ ప్రియులకి ప్రముఖ ఓటీటీ దిగజం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆసియా కప్ 2023 లైవ్ టెలికాస్ట్ తమ యాప్‌లో ఉచితంగా చూడవచ్చని వివరించింది. అయితే ఇది కేవలం మొబైల్ కు మాత్రమే అని వెల్లడించింది. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసింది. ఐపిఎల్ 2023 సీజన్ మ్యాచ్లను జియో సినిమా యాప్ ఫ్రీగా టెలికాస్ట్ చేసి కోట్ల మంది ప్రేక్షకులకు చేరువైన సంగతి తెలిసిందే.
ఇప్పుడు హాట్‌స్టార్ కూడా అదే ప్లాన్ చేస్తుంది. ఎక్కువ మంది తమ ఫ్లాట్ ఫామ్‌ను చేరుకోవాలని లక్ష్యంతో ఆసియా కప్ మ్యాచ్‌లను ఉచితంగా స్ట్రీమింగ్ చేస్తోంది. మీరు ఎక్కడికి వెళ్లినా ఎలాంటి అవాంతరాలు లేకుండా మ్యాచ్‌ని వీక్షించవచ్చు అనే మీనింగ్ వచ్చేలాగా ఆ వీడియోను రిలీజ్ చేసింది. ఇక ఇండియన్ ప్రేక్షకులకు క్రికెట్ అంటే ఎలాంటి స్థానం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవసరం లేదు.
మా వినియోగదారులకు ఈ క్రీడను మరింత చెరువు చేయాలనుకుంటున్నాం ఆసియా కప్ తో పాటు రాబోయే వన్డే ప్రపంచ కప్ నీ సైతం మొబైల్ లో ఫ్రీగా చూడండి అంటూ అనౌన్స్ చేసింది. క్రికెట్ ను దేశంలో ప్రతి ప్రాంతానికి చేరు చేసేందుకు మేము సిద్ధమయ్యాం అంటూ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రతినిధి ఒకరు మాట్లాడారు. ఇక 6 దేశాల మధ్య జరగనున్న ఆసియా కప్ 2023 టోర్నీ ఆగస్టు 30 నుంచి స్టార్ట్ కాబోతుంది. భారత్ – దాయాదుల జట్టు పాకిస్తాన్ తో సెప్టెంబర్ 2న తలపడబోతోంది.
Landing clearance mile na mile, Free mein Asia Cup aur ICC Men’s Cricket World Cup toh mil gaya!
Ab dekho duniya ke sabse bade tournaments ke sabhi matches, kahin bhi, apne mobile par, bilkul free sirf Disney+ Hotstar mobile pe pic.twitter.com/IRFC7SpBHb
— Disney+ Hotstar (@DisneyPlusHS) August 21, 2023