వెంక‌టేష్ త‌న కేరీర్‌లో అంత‌ గోప్ప సినిమాల‌ను వ‌దులుకున్నడా..? ఇంత‌కి అ సినిమాలు ఏమిటో తెలుసా..!

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. దివంగత లెజెండ్రీ ప్రొడ్యూసర్ దగ్గుబాటి రామానాయుడు నట వారసుడిగా కలియుగ పాండవులు సినిమాతో వెంకటేష్ హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. అప్పటినుంచి వర్షరుస‌ క్రేజీ సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. వెంకటేష్ నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం హిట్ సినిమాలే ఉన్నాయి.

మ‌రి ముఖ్యంగా ఆయన కెరీర్లో చంటి, కలిసుందాం రా, సుందరకాండ, బొబ్బిలి రాజా, పవిత్ర బంధం, రాజా, సూర్యవంశం వంటి సినిమాలు వెంకటేష్ కు ఎంతో క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి.వెంకటేష్ కు టాలీవుడ్ లోనే ఫ్యామిలీ అండ్ లవర్ బాయ్ ఇమేజ్ ఉంది.వెంకటేష్ తన కెరీర్ లో 90కు పైగా సినిమాల్లో నటించారు. అయితే వెంకటేష్ తన కెరీర్లో కొన్ని సూపర్ హిట్ సినిమాల‌ను మిస్ చేసుకున్నాడట.

ఆ సినిమాలను చేసి ఉంటే వెంకటేష్ నెంబర్ వన్ హీరో అయ్యుండేవాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. వెంకటేష్ తెలిసో తెలియకో కొన్ని సినిమాలను రిజెక్ట్ చేశారు. ఆ సినిమాలో ఏంటో ఇప్పుడు చూద్దాం… మణిరత్నం డైరెక్షన్లో వచ్చినటువంటి రోజా సినిమాలో మొదటగా హీరోగా వెంకటేష్ అనుకున్నారట.కానీ అప్పటికి చంటి సినిమాతో బిజీగా ఉండడంతో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట.

అలాగే కమలహాసన్ నటించిన భారతీయుడు, అర్జున్ హీరోగా వ‌చ్చిన‌ ఒకే ఒక్కడు, కృష్ణం వందే జగద్గురుమ్, గోవిందుడు అందరివాడేలే వంటి సినిమాలను రిజెక్ట్ చేశాడు. వెంకటేష్ కనుక ఈ సినిమాలను చేసి ఉంటే టాలీవుడ్ లో కచ్చితంగా నెంబర్ వన్ హీరో అయ్యుండేవాడని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇక వెంకటేష్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.’