అతిలోకసుందరి శ్రీదేవి పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..

దివంగత నటి శ్రీదేవి పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం. కొన్ని వందల సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన శ్రీదేవి ఎంతోమంది అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. తమిళనాడులో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ అసలు పేరు శ్రీ అమ్మ యాంగ‌ర్ అయ్యప్పన్‌. ఇంట్లో ముద్దుగా చిన్ని అని పిలుచుకునేవారట. ఇక ఈ రోజు శ్రీ‌దేవి 60వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఇమెకి సంబందించిన కొన్ని విష‌యాలు తెలుసుకుందాం.

ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత శ్రీదేవి గా పేరు మార్చుకుంది. ఇక కే రాఘవేందర్రావు డైరెక్షన్లో 24 సినిమాల్లో నటించింది శ్రీదేవి. దాదాపు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పదహారేళ్ళ వయసు సినిమాలో సిరిమల్లె పువ్వా సాంగ్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్గా వినిపిస్తూనే ఉంది. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణతో కలిసి శ్రీదేవి 31 సినిమాలలో నటించింది. నటిగానే కాక శ్రీదేవిలో మంచి పెయింటర్ కూడా దాగి ఉందట.

ఆమె పెయింటింగ్స్ కూడా చాలా అందంగా గీసేవార‌ట‌. ఎన్నో సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి హీరోయిన్గా నటించిన శ్రీదేవి బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్‌కి మనవరాలుగా కూడా నటించింది. శ్రీదేవి చివరిగా జీరో సినిమాలో కనిపించింది. ఈమెకు జాన్వి కపూర్, ఖుషి కపూర్ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2018లో ప్రమాదవశాత్తు శ్రీదేవి మరణించింది.