ఇటీవల మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆగష్టు్ 22 వచ్చిందంటే చాలు మెగా అభిమానులకు పండగల ఉంటుంది. వారం ముందు నుంచే హడావిడి చేయడం మొదలు పెట్టేస్తారు. ఇక తాజాగా చిరు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పుట్టినరోజు విషెస్ తెలుపుతూ కోట్లాదిమంది ప్రేక్షకులు చిరంజీవిపై కామెంట్లు వర్షం కురిపించారు.
కుటుంబ విషయాలను, పర్సనల్ విషయాలను తొందరగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకోని పవన్ కళ్యాణ్ కూడా అన్నయ్యకు స్పెషల్‌గా విషెస్ తెలిపాడు. దాంతో పాటే చాలా రేర్ ఫోటోలను షేర్ చేశాడు పవన్ కళ్యాణ్. ఆ ఫోటోలో చిరంజీవి కేక్ కట్ చేస్తున్నాడు. పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఆ ఫోటోలో పవన్ వయసు పదేళ్లు ఉండవచ్చు అంత చిన్న పిల్లవాడిలా కనిపిస్తున్నాడు.
ఈ రేర్ ఫోటోను షేర్ చేస్తూ తన అన్నయ్య మీద ఉన్న ప్రేమను ఓ క్యాప్షన్ రూపంలో చెప్పాడు. అడుగు అడుగున ఇన్స్పిరేషన్ గా నిలిచే అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ వివరించాడు. వింటేజ్ లో అన్నయ్యతో పవన్ కళ్యాణ్ దిగిన ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటో ఫ్యాన్స్‌ని ఇప్పుడు ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. ఈ పిక్ పై లైక్‌ల వర్షం కురుస్తుంది.