సౌత్ స్టార్ హీరోయిన్‌.. పెళ్లై పిల్ల‌లున్నా డైరెక్ట‌ర్‌తో ప్రేమ‌.. ఆమె చావుకు కార‌ణం ఇదే..!

అల‌నాటి న‌టి శోభ అలియాస్ మహాలక్ష్మి మీనన్.. బాలనటిగా గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టిన ఈమె చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది. 1980 మే 1న మ‌ర‌ణించింది. నూరేళ్ల భవిష్యత్తు ఉన్న ఆమె పట్టుమని 18 ఏళ్లకే తనువు చెలించడం అందరిని కలిచివేసింది‌. హీరోయిన్గా సినిమాలు చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా గదిలో శవమై తేలింది. ఇక ఈమె చావుకు గ‌ల కార‌ణం ఎంటో ఓ సారి చూద్దాం.


1962 సెప్టెంబర్ 23న నటి ప్రేమ కడుపున మహాలక్ష్మి పుట్టింది. నాలుగేళ్లకే కెమెరా ముందు నటించింది. అందరు ఈ చిన్నారి నటన చూసి ఆమెకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశించారు.

తమిళ్ థ్రిల్లర్ “తట్టుంగల్ తరక్కప్పడమ్” చిత్రంతో వెండితెరపై బాలనటిగా రంగ ప్రవేశం చేసింది. ఇందులో ఆమె బేబీ మహాలక్ష్మి గా నటించింది. ఈ సినిమాలో సావిత్రి, విజయ వంటి మహానటులు హీరోయిన్‌లుగా నటించారు. ఆ తర్వాత ఏడాది మలయాళం లో “ఉద్యోగస్త” సినిమాలో బేబీ శోభ నటించింది. ఇలా అనేక సినిమాల్లో నటించిన శోభ‌ తండ్రి వయసున్న దర్శకుడు బాలూ మహేంద్ర తో ప్రేమలో పడింది. అతడికి పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న అతడే కావాలనుకుంది. తనకోసం వారంద్దరిని వదిలేస్తాడు అనుకుంది. కన్నవాళ్ళని కూడా వదిలేసి 1978లో గుడిలో వివాహం చేసుకుంది.

అతని గుడ్డిగా ప్రేమించిన శోభాకు ఊహించని షాక్‌ తగిలింది. అతను భార్య పిల్లలను వదిలేయలేదు. ఇది శోభాకి నచ్చలేదు ఎన్నో గొడవలు జరిగాయి.. అయినా సెట్ లో మాత్రం అనీ కడుపులోని దాచుకుని నవ్వుతూ కాలాన్ని క‌నిపించేది. ఆ తర్వాత కూడా సినిమాల్లో నటించిన ఈమె 1979లో వచ్చిన పసి సినిమాకి ఉత్తమ నటిగా రాష్ట్ర ,జాతీయ అవార్డును అందుకుంది. రానున్న రోజుల్లో ఇండస్ట్రీని ఎల‌డం ఖాయం అనుకున్న సమయంలో 1980 మే 1న ఈమె తన గదిలో మంచం పక్కన మృతదేహమై కనిపించింది. తన మెడ మీద ఉరి వేసుకున్న గుర్తులు కనిపించాయి. సాధారణంగా ఆత్మహత్య చేసుకుంటే కళ్ళు వాపు వచ్చి, నాలుక బయటకు వస్తుంది.

కానీ శోభ విషయంలో అలాంటిదేమీ జరగలేదు. నా చావుకి ఎవరూ కారణం కాదని ఆమె రాసిన పత్రం కూడా ఆ రోజు దొరికింది. ఆమె నిజంగానే ఉరి వేసుకుంటే కిందకు ఎవరు దింపారు అనేది ప్రశ్న? శోభ చనిపోయిన ముందు రోజు రాత్రి మహేంద్ర తన మొదటి భార్య దగ్గరే ఉన్నాడట.. అంటే వీరి మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. అసలు శోభాది హత్య? ఆత్మహత్య? అవన్నీ ప్రశ్నలు గానే మిగిలిపోయాయి. ఇది జరిగిన నలభై మూడు ఏళ్లు అవుతున్నా నిజమేంటనేది బయటకు రాలేదు. తన మరణం మాత్రం మిస్టరీ గాని చరిత్రలో మిగిలిపోయింది. ఈమె జీవిత కథ ఆధారంగా మలయాళంలో లేఖయుడె మరణం ఒరు ష్లాష్ బ్యాక్ పేరుతో 1983లో సినిమా కూడా వచ్చింది.