పాన్ ఇండియా యాక్టర్ రానా ఇటీవల దుల్కర్ సల్మాన్ మూవీ ప్రమోషన్ ఈవెంట్లో సందడి చేశాడు. ఈ ఈవెంట్లో భాగంగా ఓ బాలీవుడ్ హీరోయిన్‌పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె ఎవరో కాదు సోనమ్‌కపూర్ అని తెలుసుకున్న జనం ఆమెను విమర్శించడంతో రానా సోనామ్‌కు క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. నేను చేసిన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే సోషల్ మీడియాలో సోనమ్‌పై విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ పెరిగాయి.
అందుకు నేను బాధపడుతున్నాను సారీ అంటూ ఓ సుదీర్ఘమైన పోస్టును రానా షేర్ చేశాడు. ఇది నెట్టింట బాగా వైరల్ అయింది. సోనమ్ కపూర్ ఈ క్షమాపణలకు కన్విన్స్ అయినట్లుగా లేదు. తిరిగి రానాకి పరోక్షంగా స్మాల్ కౌంటర్ వేసింది. సోనమ్ పెట్టిన ఓ పోస్ట్ దీనికి ఉదాహరణ. రానా సారీ చెప్పిన వెంటనే ఇన్‌స్టా స్టోరీలో సోనమ్ ఓ కొటేషన్ పోస్ట్ చేసింది. నేను కొంత మంది వ్యక్తుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను.. ముఖ్యంగా ఇతర ఇతరుల గురించి మాట్లాడే వారి గురించి.. సంకుచిత మైండ్ సెట్ ఉన్నవారు ఎదుటివారి గురించి చర్చిస్తారు.
యావరేజ్ మైండ్ సెట్ ఉన్నవారు ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుతారు. గ్రేట్ మైండ్‌సెట్ ఉన్నవారు తమ ఆలోచనల గురించి చర్చిస్తారు అంటు ఈ కొటేషన్‌లో రాసుకొచ్చింది. ఈ కొటేషన్ సోనమ్ కపూర్ టాలీవుడ్ హీరో రానాని ఉద్దేశించే పెట్టిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా రానా సారీ చెప్పి ట్విట్ చేసిన వెంటనే ఈ పోస్ట్ ఆమె షేర్ చేయడంతో సోనామ్ రానను ఉద్దేశించే ఈ పోస్ట్ చేసిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.