స‌మంత అమెరికా ఎందుకు వెళ్లావ్‌… ఈ దాగుడు మూత‌లెందుక‌మ్మా…!

మయోసైటిస్ వ్యాధి నుంచి కోల్కున్న సమంత మరింత మెరుగ్గా తయారయ్యేందుకు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సమంత విదేశాలకు వెళ్ళింది. దీంతో అంతా ఆమె చికిత్స కోసమే వెళ్ళిందనుకున్నారు. అక్కడ స్నేహితులతో కలిసి కొన్ని రోజులు ఎంజాయ్ చేసింది. అలా విహారయాత్రలను ముగించి హైదరాబాద్ చేరుకుంది. ఆ వెంటనే ఖుషి ఈవెంట్‌లో పాల్గొని. విజయ్ దేవరకొండతో కలిసి స్టేజ్ పై డ్యాన్స్ కూడా చేసింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు.

ఇప్పుడు సమంత మరోసారి విదేశీ పర్యటన మొదలుపెట్టింది. కిందటిసారి స్నేహితులతో కలిసి ఇండోనేషియా తో పాటు పలు ప్రాంతాల్లో ఎంజాయ్ చేసిన సమంత, ఈసారి తల్లితో కలిసి న్యూయార్క్ వెళ్ళింది. ఈసారి సమంత ట్రీట్మెంట్ కోసమే అమెరికా వెళ్ళుంటుందని చాలామంది భావిస్తున్నారు. సమంతా శారీరికంగా మరింత దృఢంగా తయారయ్యేందుకు, కొన్ని వారాలపాటు చికిత్స తీసుకోవడానికి వెళ్లిందన్న ఓ టాక్ ఉంది.

 

ఇక్క‌డే మ‌రో ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. న్యూయార్క్ లో జరుగుతున్న ఇండియా డే పరేడ్ లో పాల్గొనేందుకు సమంత వెళ్లిందని అంటున్నారు. ఇప్పటికే జాక్విలిన్ ఫెర్నాండెజ్ లాంటి హీరోయిన్లు న్యూయార్క్ చేరుకున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఏదేమైనా సమంత అస‌లు ఎప్పుడు ఎక్క‌డ‌కు ఎందుకు వెళుతుందో ? ఆమె దాగుడు మూత‌లాట‌లు ఏంటో తెలియ‌డం లేదు.