ర‌ణ‌బీర్‌క‌పూర్‌కు వింత వ్యాధి… తిన్నా, మాట్లాడినా ఏమవుతుందంటే…!

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. రణ్ బీర్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరిద్దరికీ ఓ కూతురు కూడా జన్మించింది.

తాజాగా రణ్‌బీర్‌కపూర్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ హీరోకి చిన్నప్పటి నుంచి ఓ వింత సమస్యతో బాధపడుతున్నాడట. ఆయనకు ‘నాసల్ డెవియేటెట్ సెప్టెమ్’ అనే సమస్య ఉందని అందుకే భోజనం చేస్తున్నప్పుడు చాలా వేగంగా తింటాడని, మాట్లాడేటప్పుడు కూడా ఇతని మాట తీరు అలాగే ఉంటుందని దీనికి కారణం అదే అని సమాచారం.

అయితే 2009లో ఓ సినిమా కోసం దర్శకుడు సర్జరీ చేయించుకోమంటే ఆయన తిరస్కరిచ్చారట. ఇకపోతే రణ్‌బీర్ కు ఉన్న సమస్య కారణంగా సైనస్ ఇన్ఫెక్షన్లు, గురక, శ్వాస సమస్యలు వంటివి రావడానికి ఆస్కారం ఉంటుందని వైద్యులు తెలిపిన ఆయన తన సమస్యను భరించాలనే నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. దీంతో ఈ విషయం తెలిసి ఆయన ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు.