ప్రభాస్ హీరోగా.. నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీ బ్యానర్స్ పై అశ్విని దత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్లో రూపొందిస్తున్న మూవీ కల్కి. ఈ సినిమాలో దీపిక పదుకొనే హీరోయిన్గా నటిస్తుంది. అమితాబచ్చన్, కమల్ హాసన్, దిశాపటాని కీరోల్స్ లో నటిస్తున్నారు. ఇప్పటికే భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమాలో మరో స్టార్ హీరో నటించబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో దుల్కర్ కూడా నటించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది.
తన కొత్త సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దుల్కర్ మాట్లాడుతూ కల్కి సినిమాపై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. కల్కి సినిమా ఓ రేంజ్ లో ఉండబోతుందని తన ఆ సెట్స్‌కి వెళ్ళాడని చెప్పిన దుల్కర్ కల్కిలో తాను నటిస్తున్నానా లేదా అనే విషయం మాత్రమే అప్పుడే బయట పెట్టనన్నాడు. దుల్కర్ మాటలు చూస్తుంటే ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్టులో దుల్కర్ కూడా ఉన్నాడు అనిపిస్తుంది.
కాకపోతే ఓ మంచి టైంలో దుల్కర్ సల్మాన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేస్తారని దుల్కర్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే భారీ తారాగణం ఉన్న ఈ సినిమాలో దుల్కర్ కూడా యాడ్ అయితే ఈ మెగా ప్రాజెక్ట్ కాస్త మరింత బిగ్ ప్రాజెక్టుగా మారుతుంది. ఇక కల్కి రెండు భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ లో కంటే రెండో పార్ట్ లోని కమల్ హాసన్ ఎక్కువగా కనిపిస్తాడని సంగతి అర్థమైపోయింది. ఇక దుల్కర్ కూడా రెండో భాగం లోనే కనిపిస్తాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.