‘ ఆహా ‘ లో కొత్త ప్యాక్‌లు … రేట్లు… ఏ ప్యాక్‌తో ఏం లాభం అంటే…!

ప్రస్తుతం టాలీవుడ్ లో ఓటిటిల హవా కూడా బాగా నడుస్తుంది. తిరుగులేని ఎంటర్టైనర్ సంస్థగా ఆహా ఓటీడీలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికే ఎన్నో బ్లాక్బస్టర్ మూవీస్‌, షోస్, వెబ్ సిరీస్లను అందించిన ఆహా తాజాగా మరో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ బేబీని స్ట్రీమింగ్ చేయడానికి సిద్ధమయింది. ఈ సినిమా ఆహాలో ఆగస్టు 25 నుంచి రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కల్ట్‌ క్లాసిక్‌గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న బేబీ సినిమా రూ.100 కోట్ల క్లబ్ చేరడానికి దగ్గరలో ఉంది. ఇటువంటి నేపథ్యంలో రూ.899 చెల్లించి ఆహా సబ్‌స్క్రిబ్ష‌న్‌ సొంతం చేసుకోమంటూ అపూర్వ అవకాశాన్ని అందించింది.

గోల్డ్ ప్యాక్ సబ్స్క్రయిబ్ చేసుకోవడం వల్ల ఏకంగా 12 గంటల ముందుగానే బేబీ సినిమాలు చూడవచ్చట. ఈ స్యాక్‌ తీసుకున్న వారు వెబ్ సిరీస్ చూసేటప్పుడు 4k డాల్ఫి ఆడియోలో ఎలాంటి యాడ్స్ లేకుండా సినిమాను చూసే అమేజింగ్ ఎక్స్పీరియన్స్ పొందుతున్నారు. ఈ సదుపాయం తెలుగు, తమిళ ఓటిటి ప్లాట్‌ఫామ్స్ సబ్స్క్రైబర్స్ కు అందుబాటులో ఉంది. అయితే ఇటివ‌ల‌ ఆహా సుబ్ స్క్రిప్షన్ లో చాలా మార్పులు చేసింది. దానికి కారణం ఎస్పీ ఒడిలో చాలా గొప్ప నంబర్స్ నమోదు అయ్యాయి. ఆహా తెలుగు ఆడియన్స్ కోసం సబ్స్క్రిప్షన్ రేట్లు భారీగా త‌గ్గించింది.

కేవలం రూ.699 తో ఏడాది పాటు ఎలాంటి యాడ్స్ లేని ప్యాక్ లభ్యం

రూ.399 ఏడాది పాటు యాడ్స్‌తో కూడిన ప్యాక్ లభ్యం.

రూ.199కి మూడు నెలల పాటు యాడ్స్ తో కూడిన ప్యాక్స్ లభ్యం.

రూ.99 ప్యాకేజీ యాడ్స్ కూడింది ఇది కేవలం మొబైల్ యూజర్స్ కు మాత్రమే.