పబ్‌లో అలాంటి పనులు చేస్తు దొరికిపోయిన కీర్తి సురేష్..!

నేను శైలజ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయింది కీర్తి సురేష్. మొదటి సినిమాతోనే భారి హిట్ ఖాతాలో వేసుకున్న కీర్తి తర్వాత వరుస‌ సినిమాలతో దూసుకుపోయింది. టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న‌ నటించి ప్రేక్షకులను మెప్పించింది. మహానటి సినిమాతో సావిత్రి బయోపిక్ లో నటించి కోట్లాదిమంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఈ సినిమాతో సావిత్రి నిజంగా బ్రతికే ఉంది అన్నట్లుగా చూపించిన కీర్తి సురేష్ కు జాతీయ అవార్డు కూడా దక్కింది.

ఈ సినిమా తర్వాత కీర్తి నటించిన సినిమాలు ఏవి ఊహించిన రేంజ్ లో సక్సస్ కాలేదు. ఇటీవ‌ల‌ నాని హీరోగా దసరా సినిమాలో నటించి భారీ హిట్ కాకపోయినా ఓ రేంజ్ లో విజయాన్ని సాధించింది. వెన్నెలగా ఆమె నటనకు, యాసకు మంచి గుర్తింపు వచ్చింది. మహానటి సినిమా తర్వాత బక్క చిక్కిన కీర్తి.. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోషూట్స్ తో కుర్రాళ‌ని ఆకట్టుకుంటుంది.

తాజాగా కీర్తి స్లీవ్ లెస్ టాప్‌లో పబ్‌లో డ్యాన్సులు వేస్తూ చిల్ అవుతూ కనిపించింది. దీంతో ఈ వీడియోస్, ఇమేజెస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక‌ డాన్స్ అదరగొట్టావ్ కీర్తి అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ రెండు సినిమాల్లో నటిస్తుంది మరి ఈ సినిమాల కీర్తికి మంచి విజయాన్ని తెచ్చి పెడతాయో..? లేదో..? చూడాలి.