జైలర్ కలెక్షన్ల బీభత్సం.. 400 కోట్ల క్లబ్ లోకి..!

సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల నటించి బ్లాక్ పాస్టర్ హిట్ టాక్‌ని సొంతం చేసుకున్న మూవీ జైలర్. రిలీజై వారం రోజులు కూడా కాకముందే భారీ కలెక్షన్లు వసూలు చేస్తూ రికార్డులను సృష్టించింది. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫ్యామిలీ సెంటిమెంట్‌తో యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో ఆగస్టు 10న ప్రేక్ష‌కుల‌ముందుకి వ‌చ్చింది.

థియేటర్స్‌లో గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ మూవీ కోట్లాదిమంది అభిమానులను ఆకట్టుకుంది ఇక మొదటి నాలుగు రోజులు ఓ రేంజ్ లో కలెక్షన్లను వసూలు చేసిన జైలర్ ఆగస్టు 15న మరింత భారీ ఆక్యుపెన్సీ ని దక్కించుకుంది. ఈ సినిమా ఇండిపెండెన్స్ డే రోజుతో భారీ కలెక్షన్లను కొల్లగొట్టి రూ.400 కోట్ల క్లబ్ లోకి జాయిన్ అయిపోయింది.

మోహన్ లాల్, జాకీ ష్రాప్, శివరాజ్ కుమార్ గెస్ట్‌రోల్ లో నటించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, తమన్నా హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో తమన్నా నువ్వు కావాలయ్యా సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.