కుటుంబానికి దూరంగా ముంబైలో హీరో సూర్య నివాసం.. క్లారిటీ ఇచ్చేసాడుగా..!

సౌత్ ఇండియన్ స్టార్ హీరో సూర్య అటు తమిళంలో ఇటు తెలుగులోనూ తనకంటూ ఓ మంచి ఫ్యాన్ వేసిన సంపాదించుకున్నాడు. సూర్య త‌న‌ సినిమాల్లో కేవలం యాక్టర్ గానే కాకుండా నిర్మాత గాను సక్సెస్ సాధించాడు. ఇక‌ సూర్య ప్రతి కదలికపై అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపుతూఉంటారు. కొన్ని రోజులు నుంచి సూర్య తమిళనాడులోని ఆయన కుటుంబానికి దూరంగా ముంబైలో భార్య పిల్లలతో కలిసి ఉంటున్నాడు.

తండ్రి, తమ్ముడుతో గొడవల వల్లే ఆయన ముంబైలో ఇల్లు తీసుకుని ఉంటున్నాడు అంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ న్యూస్ అప్పట్లో వైరల్ అవ్వడంతో సూర్య అభిమానులు ఆందోళన పడ్డారు. ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సూర్య ఇటీవల ముంబైలో నిర్వహించిన ఫ్యాన్స్ మీట్‌కు హాజరయ్యాడు. ఇందులో సినిమాలతో పాటు ఎన్నో వ్యక్తిగత విషయాలు కూడా వెల్లడించిన సూర్య ముంబై కి మక్కా మార్చడానికి గల కారణాన్ని కూడా వివరించాడు.

 

 

సూర్య మాట్లాడుతూ నేను తమిళనాడును విడిచి పెట్టేది లేదని నా జన్మస్థలం అదే అంటూ వివరించాడు. నేను కుటుంబంతో సహా ముంబైకి రావడానికి నా పిల్లలే కారణమని.. వారి పై చదువుల కోసం ఇక్కడకు రావాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. అంతే తప్పితే నేను ఎప్పటికీ నా జన్మ స్థలాన్ని వదిలి ఉండనని స్పష్టం చేశారు. నేను ఎప్పటికీ తమిళనాడులోనే ఉంటానని సూర్య చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వారి కుటుంబానికి సూర్యకి మధ్యన గొడవల వార్తలు పుకార్లేనంటూ స్పష్టమైంది. దీంతో అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.