ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ఏ స్థాయిలో మారుమోగుతుందో అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే అల్లు అర్జున్ కు ఉత్తమ జాతీయ నటుడుగా అవార్డు కూడా వచ్చింది. ఇదే సమయంలో ఆయనకు సంబంధించిన ఎన్నో రకాలు వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ఆయన కెరీర్ లో వచ్చిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీ షూటింగ్ సమయంలో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ తనను ఎంతో ఇబ్బంది పెట్టినట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఆ సినిమా రిలీజ్ సమయంలో కూడా అను ఇమ్మానుయేల్- అల్లు అర్జున్ కు ఏమాత్రం సూట్ కాలేదని అభిమానులు సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు.
ఇక అను ఇమాన్యుల్ కేవలం బన్నీకి మాత్రమే కాకుండా ఆయన సోదరుడు అల్లు శిరీష్ కూడా భారీ ప్లాఫ్ ఇచ్చింది. దీంతో అను ఇమ్మానుయేల్ తో మరోసారి సినిమా అవకాశం వచ్చినా కూడా బన్నీ అందుకు నో చెప్పాడట. ప్రజెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.