పూజకి మరోసారి షాక్.. హరీష్ శంకర్ కూడా హ్యాండ్ ఇచ్చేసాడు..!!

టాలీవుడ్‌లో పూజహెగ్డేకు ఎవరు అవకాశాలు ఇచ్చిన ఇవ్వకపోయినా ఇద్దరు దర్శకులు మాత్రం ఆమెను తమ సినిమాల్లోకి తీసుకునేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. వాళ్లలో ఒకరు త్రివిక్రమ్, మ‌రొకరు హరీష్ శంకర్. వీళల్లో త్రివిక్రమ్ కు పూజహెగ్డే కమిట్మెంట్, డెడికేషన్ అంటే ఇష్టమట. ఇక హరీష్ శంకర్ అయితే పూజా హెగ్డేను సెంటిమెంట్ గా ఫీల్ అయ్యి తమ సినిమాల్లోకి తీసుకుంటాడట. కానీ ఇప్పుడు ఇద్దరి దర్శకులు ఈ బ్యూటీకి హ్యాండ్ ఇచ్చారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా నుంచి పూజాహెగ్డే తప్పుకున్న సంగతి తెలిసిందే.

ఆమె తప్పుకుందా, యూనిట్ తప్పించిందా అనేది వేరే విషయం. త్రివిక్రమ్ సినిమాలో పూజ హెగ్డే లేదనేది పెద్ద షాకింగ్ విషయం. ఇప్పుడు హరీష్ శంకర్ కూడా ఈ ముద్దుగుమ్మ కి హ్యాండ్ ఇచ్చాడట. పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు హరీశ్. ఇందులో పూజా హెగ్డే కోసం ఓ పాత్ర సిద్ధంగా ఉందంటూ కొన్ని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా సాక్షి వైద్యను ఈ ప్రాజెక్టులోకి తీసుకున్నారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పూజాహెగ్డేకు రోల్ లేదన్న విషయం తెలిసిపోయింది. ఈ మూవీలో ఫస్ట్ హీరోయిన్ గా శ్రీ లీల, సెకండ్ హీరోయిన్ గా సాక్షి కనిపించనున్నారు.

గుంటూరు కారం సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకోవడానికి కారణం దర్శకుడు పై మహేష్ బాబు ఒత్తిడి పెట్టడంతో పూజా హెగ్డే ని తొలగించారని తెలుస్తుంది. ఉస్తాద్ నుంచి పూజా హెగ్డే ని తప్పించడానికి అసలు కారణం ఏమిటో ఇంకా తెలియలేదు. దర్శకుల సెంటిమెంట్స్ సంగతి పక్కన పెడితే ఇటు మహేష్ అటు పవన్ కళ్యాణ్ లాంటి ఇద్దరు స్టార్ హీరోల సినిమాలో నటించలేకపోయింది. ఆమె కెరీర్‌కు ఇదే పెద్ద దెబ్బ. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ సినిమాకు పూజ హెగ్డేను ఏనాడు ఎవరు సంప్రదించలేదని హీరోయిన్ పూజ పర్సనల్ మేనేజర్ హరి తెలిపాడు.